హుస్నాబాద్, ఫిబ్రవరి 24: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో ముక్కెర మల్లయ్య ఇంట్లో సుమారు రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలను శనివారం సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సీజ్ చేశారు. 50 కిలోల బరువుండే 26 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మహ్మదాపూర్లోని ముక్కెర మల్లయ్య ఇంట్లో సోదాలు చేయగా.. ఎలాంటి ప్యాకింగ్, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఉన్న పత్తి విత్తనాల బస్తాలు దొరికాయి.