హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కొంతమంది ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ తరహా మోసం హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు ఏసీబీ ఎప్పుడూ డబ్బులు అడగదని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీకాల్స్కు స్పందించవద్దని కోరారు.