‘భూ భారతి’ దరఖాస్తుదారులకు కాంగ్రెస్ సర్కార్ ధోకా
రాష్ట్రంలో వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం ‘భూ భారతి’ పోర్టల్‌లో స్లాట్లు బుక్ చేసుకుని, డబ్బు చెల్లించినవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా చేస్తున్నది.
- రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకున్నా సొమ్ము వాపసు ఇవ్వని వైనం
- గత రెండున్నర ఏండ్లలో రూ.300 కోట్లకుపైగా పెండింగ్
- సొంత అవసరాలకు దారిమళ్లిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
- రీఫండ్ కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్న బాధితులు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ రకాల రిజిస్ట్రేషన్ల కోసం ‘భూ భారతి’ పోర్టల్‌లో స్లాట్లు బుక్ చేసుకుని, డబ్బు చెల్లించినవారికి కాంగ్రెస్ ప్రభుత్వం ధోకా చేస్తున్నది. ఆ లావాదేవీ లు రద్దు చేసుకున్న వారికి సొమ్ము వాపసు ఇవ్వకుండా వేధిస్తున్నది. రెండున్నర ఏండ్ల లో రూ.300 కోట్లకుపైగా పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో ఎంతో మం ది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ల బుకింగ్ సమయంలో చెల్లించిన సొమ్ము ను తిరిగి పొందేందుకు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ల కోసం ‘ధరణి’ పోర్టల్‌లో స్లాట్లు బుక్ చేసుకుని, చలాన్లు చెల్లించినవారిలో ఎవరైనా రీఫండ్ కోరితే కేసీఆర్ ప్రభుత్వం వెంటనే చెల్లించేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ విధా నం అమలైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభు త్వం కుయుక్తితో వ్యవహరిస్తున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ‘భూ భారతి’ పోర్టల్‌లో స్లాట్లు బుక్ చేసుకుని, డబ్బు చెల్లించిన వారిని దారుణంగా మోసగిస్తున్నది. ఆ లావాదేవీలు రద్దు చేసుకున్న వారికి సొమ్ము వాపసు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నది. ఆ సొమ్ములను దారిమళ్లించి తన అవసరాలకు వాడుకొంటున్నది.
క్రమబద్ధీకరణ దరఖాస్తులు తిరస్కరించినా నో రీఫండ్
జీవో 59 కింద స్థలాలు, ఇండ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుని, డబ్బు చెల్లించిన పేదల పట్ల కూడా రేవంత్‌రెడ్డి సర్కార్ ఇదేవిధంగా వ్యవహరిస్తున్నది. ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురైనవారికి సొమ్ము వాపసు ఇవ్వడంలేదు. అలా 3,140 మందికి రూ.70 కోట్లు రీఫండ్ చేయకుండా నిలిపివేసింది. బీఆర్ఎస్ హయాంలో జీవో 58, 59 కింద పేదల స్థ లాలు, ఇండ్ల క్రమబద్ధీకరణ చేపట్టడంతో అనేకమంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దరఖాస్తుదారుల నుంచి ఫీజులు వసూలు చేసింది. వాటిలో పలు దరఖాస్తులు తిరస్కరణకు గురైనా రేవంత్ సర్కార్ వారికి సొమ్మును వాపసు ఇవ్వడం లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

