హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పేషియల్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్) హాజరును అమలుచేయనున్నారు. అంతేకాకుండా రోజువారి హాజరును సైతం మానిటరింగ్ చేస్తారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ, ప్రతి నెలా తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారు. యోగా, స్పోర్ట్స్లకు ప్రాధాన్యం ఇస్తారు.
ఇంటర్ విద్య అధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అకడమిక్ మాడ్యూల్తోపాటు విద్యార్థుల హాజరును సమర్థంగా అమలుచేయాలని సూచించారు. ఇంటర్ ఫలితాలపై సమీక్షించిన ఆయన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ఆదేశించారు.