హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): సచివాలయ ఉద్యోగులకు గురువారం నుంచి ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్’ విధానం అమల్లోకి రానున్నది. సచివాలయ ఖాతా నుంచి జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగులు ఉద యం కార్యాలయానికి వచ్చేటప్పుడు, విధు లు ముగించుకొని వెళ్లే సమయంలో కచ్చితంగా అటెండెన్స్ వేయాలని వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విధానంపై అభ్యంతరాలు ఉన్నాయంటూ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులు కొన్నిసార్లు కోర్టుపని, అసెంబ్లీ విధులు, మంత్రు లు, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలస్యంగా రావడం, వెళ్లడం వంటివి జరుగుతాయని పేర్కొంటున్నారు. ఈ విధానాన్ని బలవంతంగా రుద్దుతున్నారని విమర్శిస్తున్నారు.