Red Alert To Telangana | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం రికార్డయ్యింది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండురోజులు పలుజిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. శనివారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు భారీ వర్షాలు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం నుంచి తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. కామారెడ్డి, ఖమ్మం, వరంగల్, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా బోమన్‌దేవిపల్లిలో 13.7 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్ వివరించింది.
Harish Rao | రేవంత్ రెడ్డి యూ ఆర్ ఏ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్.. మండిపడ్డ హరీశ్‌రావు