పెరుగుతున్న చలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచుదుప్పటి కప్పేస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచుదుప్పటి కప్పేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు పొగమంచులోనే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో 10-15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరుగుతున్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతానికి తమిళనాడు వైపు కదులుతున్నదని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

