మేడ్చల్, మే 20 : సీఎం రేవంత్‌తోపాటు మంత్రుల పేర్లు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. మేడ్చ ల్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ శంకర్‌రెడ్డి బుధవారం వివరాలు తెలిపారు. మె దక్ జిల్లా శివ్వంపేటకు చెందిన సంతోష్‌గుప్తా సుచిత్ర ప్రాంతంలో స్థిరపడ్డా రు. సీఎం రేవంత్‌రెడ్డి పీఏ, పీసీసీ స భ్యుడిని తనను పరిచయం చేసుకొని మునీరాబాద్‌లో ఆర్ఆర్ రియల్ ఎస్టే ట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. వ్యాపారంలో సమస్యను సెటిల్ చేస్తే ప్రతిఫలంగా తనకు ఐదు విల్లాలను విక్రయించి, ఆ మొ త్తాన్ని ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. భయంతో వారు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సంతోష్గుప్తాపై నిఘా పెట్టారు. మంగళవారం సుచిత్ర సమీపంలోని తన ఇంట్లో అరెస్ట్ చేశారు. సంతోష్‌గుప్తా ఇప్పటికే సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి ప్రాంతాల్లో వసూళ్లు చేసినట్టు తెలిసిందని ఏసీపీ చెప్పారు. ఇలాంటి జరిగినప్పుడు బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.