హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లను నరికివేయరాదని పేరొంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న దృష్ట్యా విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. ఈ నెల 24లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుకయారా ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గచ్చిబౌలిలోని 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌చేస్తూ, వట ఫౌండేషన్, హైదరాబాద్‌కు చెందిన బాబూరావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్లు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. ప్రజాశాంతి వ్యవస్థాపకుడు పాల్ కూడా సోమవారం పిల్ వేశారు. వీటన్నింటినీ కలిపి ఈ నెల 24న విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. వట ఫౌండేషన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..
ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిందని, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ నుంచి నివేదిక తెప్పించుకుందని తెలిపారు. అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత చర్యలను నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. దీంతోపాటు చెట్ల నరికివేతకు అవసరమైన అనుమతులు తీసుకున్నదీ లేనిదీ సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆదేశించిందని చెప్పారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ప్రవీణ్‌కుమార్ వాదిస్తూ, కంచగచ్చిబౌలి భూముల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం స్థాయీ నివేదిక సమర్పించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. రాష్ట్ర అటవీశాఖ తరఫున సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపిస్తూ, టీజీఐఐసీకి భూమి కేటాయింపును వ్యతిరేకిస్తున్న వాళ్లు, ఆ భూముల్లో నెమళ్లు, జింకలు పారిపోతున్నట్టు నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించాలని కోరగా, హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో లో ఉన్నదని, అకడ నిర్ణయాన్ని బట్టి ఇకడ విచారణ చేపడతామని స్పష్టంచేసింది. సుప్రీ ంకోర్టు విచారణ ఈ నెల 16న జరగనున్నందున ఇకడి వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.