హైదరాబాద్, మే20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకు విధించిన గడువును 25వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ సెక్రటరీ వర్షిణి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. సొసైటీ గురుకులాల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి, రుక్మాపూర్ సైనిక్ సూల్, మల్కాజ్గిరి ఫైన్ఆర్ట్స్ సూల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఇటీవల విడుదల చేశారు.
అర్హత పొందిన విద్యార్థులు కేటాయించిన గురుకులాల్లో చేరేందుకు విధించిన గడువు మంగళవారంతో ముగిసిపోయింది. దీంతో తుది గడువును 25 వరకు పొడిగించినట్టు వర్షిని ప్రకటనలో తెలిపారు.