హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించినట్టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ తెలిపింది.
ఈ నెల 15 వరకు దరఖాస్తు గడువు ఉండగా, దానిని 20 వరకు పొడిగించారు. వైద్యుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెడికల్ కౌన్సి ల్ ఒక ప్రకటనలో తెలిపింది.