అబిడ్స్, జనవరి 3 : నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ వీహెచ్, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో కలిసి నుమాయిష్‌ను ప్రారంభించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్ కళాశాలగా మారుస్తామన్నారు.
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : పాఠశాల స్థాయిలో రవాణా విద్య సిలబస్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ‘రోడ్డు భద్రత.. సమాజంలో అందరి బాధ్యత’ అని తెలిపారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాలను, ఎలక్ట్రిక్ రీచార్జి స్టేషన్‌ను ప్రారంభించారు.