హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణలో పెరిగిన జిల్లా ల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరారు.
ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ భేటీ అయ్యారు. విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేం ద్ర మంత్రులతో భేటీకి ముందు కాంగ్రె స్ అగ్రనేత సోనియాగాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియాకు అందజేశారు.