Congress Govt | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవటం తో ఇకపై మద్యం వ్యాపారం మీదనే సంక్షేమ పథకాలను నెట్టుకురావాలని నిర్ణయించుకున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ కు ప్రభుత్వం రూ.50 వేల కోట్ల రాబడి ల క్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలిసింది. మద్యం ధరలు పెంచటం, సాధారణ విక్రయాలను రెండింతలు చేయటం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని ఆ శాఖకు చెందిన అత్యున్నతస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. రైతు భరోసా, రు ణమాఫీ, భవిష్యత్తులో అమలు చేయబోయే ఇందిరమ్మ అభయహస్తం తదితర పథకాలన్నీ మద్యం డబ్బు ద్వారానే నడపాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే బీర్ల ధరలు 15 శాతం పెంచిన ప్రభు త్వం వచ్చే వారం పది రోజుల్లో విస్కీ, రమ్, విదేశీ మద్యం ధరలు కూడా 25 శాతం మే రకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఎడమ చేతితో కొద్దో గొప్పో రైతు భ రోసా విధిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మూ డు రోజుల్లో కుడి చేతితో మద్యం పోసి రైతులు, రైతు కూలీల ముక్కుపిండి రూ.330 కోట్లు వసూలు చేసినట్టు వ్యవసాయ, ఎక్సైజ్ శాఖలు లెక్కలు కడుతున్నాయి.
‘ఇవాళ అర్ధరాత్రి దాటంగనే భరోసా పైసలు టకీటకీమని రైతుల ఖాతాల్లో పడుతాయి’ అని గత నెల జనవరి 26న నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో జెండా పండగ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 18 రోజు లు గడిచినా వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నారు ఇదే ముఖ్యమంత్రి బీర్ల బేసిక్ ధర మీద 15 శాతం అదనపు ధరలు పెంచు తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేస్తే.. తెల్లారేసరికల్లా పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. సాధారాణ, మధ్య తరగతి మందుబాబులు ఎక్కువగా తాగే బీరు సీసా బ్రాండ్ల మీద ఎకాఎకిన రూ.40 వరకు పెరిగింది. రాత్రికి రాత్రే పాత బీర్ల మీది ఎమ్మా ర్పీ తొలగించి, కొత్త ఎమ్మార్పీ ప్రైస్ లేబుళ్లతో మార్కెట్లోకి విడుదల చేశారు. కానీ ఇదే స్పీ డు రైతు భరోసా మీద లేదని రైతులు వాపోతున్నారు. రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లకు మించి రైతుల ఖాతాల్లో జమ కావాలి. కానీ పెంచిన బీర్ల ధరలు అమల్లోకి వచ్చిన మంగళవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు రూ.330 కోట్లు మద్యం వ్యాపారం ద్వారా సమకూరినట్టు ఎక్సైజ్ ని వేదికలు చెప్తున్నాయి. ప్రత్యేకించి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 577 గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయాల మీద ఎక్సైజ్ శాఖ ఆసక్తి కనబరిచినట్టు తెలిసింది. రేట్లు పెరిగిన తరువాత ఆయా గ్రా మాల్లో బీర్ల విక్రయాలు ఎలా ఉన్నాయో అ ని ఆరా తీసినట్టు సమాచారం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు రూ.40 వేల కోట్ల రాబడిని లక్ష్యంగా నిర్దేశించగా.. మొదటి రెండు క్వార్టర్ల కాలంలో (6 నెలలు) అంచనాలు తప్పినట్టు నివేదికలు చెప్తున్నాయి. దీంతో మద్యం విక్రయాలు పెంచాలని ఎక్సైజ్ సిబ్బంది మీద ఒత్తిడి చేయటంతో వారు గ్రామాల్లో బెల్టు దుకాణాలను ప్రోత్సహించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు మధ్యవర్తిత్వం చేసి లైసెన్స్డ్ దుకాణదారులతో మాట్లాడి బెల్టు దుకాణాల వారికి అరువుకు సరుకు ఇప్పించినట్టు ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. విక్రయాలలో వెనుకబడిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు మెమోలు ఇవ్వటం చేశారు. దీంతో కొంతమేర ఆదాయం పెరిగినట్టు తెలిసింది. అంచనా వేసినంత రాబడి లేకపోవటంతో ఏకంగా ఎక్సైజ్ కమిషనర్‌కే ఎసరు పెట్టి ఆయన్ను బదిలిపై మరో శాఖకు పంపినట్టు అప్పట్లో కలకలం రేగింది. గత అనుభవాలరీత్యా ఈసారి జాగ్రత్తలు తీసుకొని లక్ష్యాన్ని నిర్దేశించినట్టు తెలిసింది.