హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): లారీ ఓనర్లకు సర్కారు అండగా ఉంటున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రిని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి, పలు సమస్యలపై వినపతి పత్రం ఇచ్చారు. లారీ ఫిట్నెస్ ఫీజును పాత పద్ధతిలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ర్టాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలుపై ఏపీ రవాణా శాఖ మంత్రి విశ్వరూప్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి త్వరలో హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌గౌడ్, కోశాధికారి వేముల భూపాల్, ఉపాధ్యక్షుడు అత్తాపురం రామచంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.