హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేయడం పరిపాటి అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వాసనీయ సమాచారం అందడంతో ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విల్లాలో తనిఖీలు చేశారని తెలిపారు. రొటీన్ ప్రాసెస్‌లో భాగంగానే అధికారులు సోదాలు చేశారని, వేడుకలకు పర్మిషన్ తీసుకోలేదని, అనుమతి లేకుండా లికర్ పార్టీ జరిగినట్టు అధికారులు గుర్తించారని పేర్కొన్నారు.
యాదగిరీశుడి ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేస్తాం ; మంత్రి కొండా సురేఖ
యాదగిరిగుట్ట, అక్టోబర్ 27 : స్వామివారికి వచ్చిన డబ్బులన్నీ స్వామివారికే ఖర్చు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని ఆదివారం ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు స్వామివారి విమానగోపురం స్వర్ణతాపడం పనులు పూర్తి చేస్తామన్నారు. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థకు 12 కిలోల బంగారం అందజేశామని తెలిపారు.