హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): అశోక్‌నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అక్రమంగా అరెస్టు చేసిన గ్రూప్-1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. గ్రూ ప్స్ అభ్యర్థులు కోరుతున్న మేరకు వెంటనే పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, అశోక్‌నగర్‌కు వచ్చి తమకు మద్దతు ప్రకటించాలని టీజీపీఎస్సీ అభ్యర్థులు బుధవారం రాత్రి కేటీఆర్‌ను ఎక్స్ వేదికగా అభ్యర్థించారు. ‘కేటీఆర్ సార్.. మమ్మల్ని క్షమించండి. దయచేసి అశోక్‌నగర్‌కి రండి. మాకు మీ మద్దతు కావాలి. అన్ని సంస్థలూ రాజీపడ్డాయి. మీరు వస్తే, మొత్తం గ్రూప్-1 అభ్యర్థులు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు’ అని పలువురు అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పంది స్తూ.. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యావంతులైన యువత నిరసన తెలిపే హకులను కూడా హరించి వేస్తున్నదని మండిపడ్డారు.
గ్రూప్స్ అభ్యర్థులు అనేక అంశాలపై తమ కు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పలు కేసులు వేసి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని, ఈ సమయంలో ఒక కేసులో వచ్చి న తీర్పుని అడ్డు పెట్టుకుని ప్రభుత్వం మొండి గా ఈ నెల 21న గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవ్వడం దారుణమని కేటీఆర్ పేర్కొన్నారు. స్వయంగా విద్యార్థులే గ్రూప్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కో రుతున్నప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటిని ప్రశ్నించారు. ఇదే అశోక్‌నగర్‌లోని యువతీ, యువకుల వద్దకు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేతలు వచ్చి ప్రాధేయపడి ఓట్లు వేయించుకొన్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆకాంక్షలను పకనపెట్టి నిరంకుశంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. పోలీసుల చేత అరెస్టులు, దాడులు చేయిస్తున్న ప్రభుత్వ క్రూరమైన వ్యవహారాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని పేర్కొన్నారు.