JNTUH | హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. జేఎన్టీయూ పరిధిలో రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన పరీక్షల తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు మరో రెండు రోజులు సెలవులు ప్రకటించారు.