Santosh Kumar | ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎర్రవల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ బాదం, సీతాఫలం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పుట్టిన రోజుతో పాటు ముఖ్య దినాల్లో మొక్కలు నాటే సాంప్రదాయాన్ని పాటించాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అనేక మంది ప్రముఖులు మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ అనుకూలమైన స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కో ఫౌండర్ రాఘవ్ కూడా పాల్గొన్నారు.
Continuing my journey with my #GreenIndiaChallenge initiative by planting Badam and Custard Apple saplings in Erravalli Village along with @RaghavBRS Co_Founder #GIC and fellow green lovers on today’s #WorldEnvironmentDay. Nature does not hurry, yet everything is accomplished.… pic.twitter.com/Y6e1CFXmfE
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 5, 2024