వేలేరు, జనవరి 20: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, వారికిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ నిరసనలో మాజీ జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు నర్సి ంహరావు తదితరులు పాల్గొన్నారు.