హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన నీరాకేఫ్ గౌడజాతి ఆత్మగౌరవానికి ప్ర తీక అని 43 గౌడ సంఘాలు స్పష్టంచేశాయి. నీరాకేఫ్‌ను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా భేషరతుగా తెలంగాణ రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక ఆర్థిక సహకార సం స్థకు అప్పగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. పర్యాటక అభివృద్ధి సంస్థతో సంబంధం లేకుండా నీరా కేఫ్‌ను కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గౌడ, కల్లుగీత కార్మిక సంఘాల సమన్వయ వేదిక పిలుపుమేరకు ఈ నెల 17న వేలాదిమందితో తలపెట్టిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపా రు. తాము కోరినట్టుగా నీరాకేఫ్, అక్కడి స్థలం కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించకపోతే 17న మహాధర్నా చేపడతామని హెచ్చరించారు.
నీరా కేఫ్ గౌడుల ఆత్మగౌరవ ప్రతీక
నెక్లెస్‌రోడ్‌లోని నీరాకేఫ్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలో 43గౌడ సంఘాల ప్రతినిధులు శనివారం సమావేశమయ్యారు. నీరా కేఫ్ గౌడన్నల ఆ త్మగౌరవ ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దానిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ మేరకు మహాధర్నాను తాతాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. పూర్తి హకులతో కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించకపోతే యథావిధిగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బీసీ కార్పొరేషన్ నిధులతో నీరాకేఫ్‌ను నిర్మిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి తొలగిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన నామమాత్రపు సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకొని.. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 17 తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. నీరాకేఫ్‌లో తొలగించిన అద్దాలను, కృత్రిక చెట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దాం
హకుల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా గౌడ్స్ అంతా సంఘటితమై పోరాడాల్సిన అవసరముందని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. కల్లుగీసే సమయంలో అనేక మంది వృత్తిదారులు మృత్యువాత పడ్డారని తెలిపారు. వారికి ప్రభుత్వం వెంటనే 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నీరా కేఫ్ వేదికగా త్వరలో గౌడ మహాసభ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలలాది మంది గౌడన్నలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నీరాకేఫ్‌ను గౌడన్నలకు ఇవ్వకపోతే.. ఎన్నిరోజులైనా ధర్నా చేస్తామని తేల్చిచెప్పారు. ఇక నుంచి గౌడ మహాజనసభ పిలుపు మేరకు మాత్రమే ఉద్యమించాలని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ మంత్రి రాజేశంగౌడ్, తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, కొడూరి సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, గౌడ సంఘాల నాయకులు పంజాల జైహింద్ గౌడ్, పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మా ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదు
మా జాతి హకుల కోసం, మా ఆత్మ గౌరవం కోసం.. గౌడ జాతి అస్తిత్వం కోసం మాత్రమే మేము పోరాడుతున్నాం. మంచి చేసిన ప్రభుత్వాలకు అండగా ఉంటాం. చెడు చేయాలని చూసే ప్రభుత్వాలను బొందపెడతాం. గౌడన్నల కోసం ఆలోచన చేయాలి. మద్యం షాపులలో గౌడలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వనాల పెంపకానికి 5 ఎకరాల భూమి కేటాయించాలి. వృత్తిదారులపై నారోటిక్, పోలీస్ దాడులు ఆపాలి.
– పల్లె రవికుమార్‌గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్
టూరిజం ఎండీని సస్పెండ్ చేయాలి
ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టిస్తున్న టూరిజం ఎండీ ప్రకాశ్‌రెడ్డిని సస్పెండ్ చేయాలి. గౌడ సం ఘాల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయకూడదు. భేషరతుగా గీత కార్పొరేషన్ సంస్థకు నీరా కేఫ్‌ను నిర్వహణ అప్పగించాలి. ప్రభుత్వాన్ని పకదారి పట్టించేలా ప్రవర్తిస్తున్న ఎండీ ప్రకాశ్ రెడ్డి సర్క్యూలర్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఎలాంటి టెండర్ లేకుండా ప్రైవేట్ వ్యక్తి అయిన శంకర్‌రెడ్డికి కేఫ్‌ను కట్టబెట్టడం దారుణం. ప్రభుత్వం స్పందింకపోతే మూల్యం తప్పదు.
– యెలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్