Satyavathi Rathod | మహబూబాబాద్, ఆగస్ట్ 01 : సుప్రీంకోర్టు తీర్పుతో మూడు నెలల అనంతరం ఉప ఎన్నికలు తథ్యమని, బీఆర్ఎస్ శ్రేణులు ఉప ఎన్నికల సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. డోర్నకల్ నియోజకవర్గం సీరోల్ మండలంలోని మన్నెగూడెం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ స్వాగతిస్తున్నది. సుప్రీం తీర్పుతో కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టింది. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు మా పార్టీ సిద్ధం అవుతుంది. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
కోర్టు తీర్పుతో అంతిమంగా సత్యం ధర్మం గెలిచింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గిరిజనులకు స్వర్ణ యుగం అని, అనేక ఏళ్లుగా ఎదురుచూసిన తాండలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటుచేసి, 6 శాతం ఉన్న రిజర్వేషన్ 10 శాతానికి పెంచుకున్నామన్నారు. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధిపై, గిరిజన సమాజానికి స్థానిక ఎమ్మెల్యే , గిరిజన శాఖ మంత్రి 20 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పకుండా దాటవేస్తూ, మా పార్టీ విషయాలు మాట్లాడుతున్న ఎమ్మెల్యేను కోరుతున్న కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని మేము పరిష్కరించుకుంటాం అది మీకు అవసరం లేదు మీరు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి అని మేము మళ్ళీ అడుగుతున్నామ్. డోర్నకల్ అనేది నా గడ్డ.. సత్యవతి రాథోడ్ అడ్డా.. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాను, నా భర్త చనిపోతే కూడా ఆ యొక్క కార్యక్రమం ఈ గడ్డమీదనే పూర్తి చేసుకున్నాను. మంత్రిగా ఇక్కడ నుండే పరిపాలన సాగించాను, జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాను, అలాంటి నాకు డోర్నకల్ రావడానికి ఎవరి దయాదాక్షిణ్యాలు పర్మిషన్ కానీ అవసరం లేదని తెలియాచేస్తూ మీ మాటలను ఖండిస్తున్నానని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
బిఆర్ఎస్ పార్టీని, నన్ను విమర్శిస్తే మీరు పెద్దవాళ్లు అవుతామని అనుకునే మీ అనాలోచితం నిర్ణయం సరికాదు.
మీరు ఎమ్మెల్యేగా డోర్నకల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి గిరిజనాభివృద్ది కి మీరేం చేశారు? మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని డోర్నకల్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, మీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, భద్రాచలం ఎమ్మెల్యే ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కేంద్రానికి విన్నవించారు, అది మీ పార్టీ నిర్ణయమా లేక భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు నిర్ణయమా? ముందు అది చెప్పాలి, మీ పార్టీలో డబుల్ స్టాండ్ పనిచేస్తుంది, రాష్ట్రంలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టి ప్రశ్నించాలి. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ మీరంటే నాకు గౌరవం ఉంది. ఆ యొక్క గౌరవాన్ని మీరు తగ్గించుకోవద్దని నేను కోరుతున్నానని సత్యవతి రాథోడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డోర్నకల్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, సొసైటీ చైర్మన్ కొండపల్లి సీతారాం రెడ్డి, మన్యు ప్యాట్నీ, బొడ శ్రీను, తేలూరి శ్రీను, వీరస్వామి, ముత్తయ్య, రుద్ర శీను, ఆకులూరి వెంకన్న, కొత్త వీరబాబు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.