CM KCR | హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. పొన్నాల లక్ష్మయ్య దంపతులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పొన్నాల దంపతులతో కేసీఆర్ ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత దోసోజు శ్రవణ్ తదితరులున్నారు.
