Niranjan Reddy | హైదరాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి స్పందించారు.
గిరిజన విద్యార్థి శైలజ మరణం ప్రభుత్వ హత్యే అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది పాలనతో గురుకులాల విద్యను దిగజార్చారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుగా ఎదిగిన గురుకులాల ప్రతిష్టను కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల పాఠశాల, వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం కనీసం సమీక్షించడం లేదు. విద్యార్థుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. శైలజ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Shailaja | మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ
KTR | ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నుదెవరో.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం