Jogu Ramanna | హైదరాబాద్ : తేమ నిబంధన, బయోమెట్రిక్, కిసాన్ కపాస్ యాప్ను తొలగించే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదు అని మాజీ మంత్రి జోగు రామన్న తేల్చిచెప్పారు. అఖిలపక్షం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని ప్రసంగించారు.
రైతులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం. పత్తి రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమానికి రైతుల భారీ ఎత్తున తరలి రావడం జరిగిందన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారని జోగు రామన్న పేర్కొన్నారు.
