Harish Rao | మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల పరిధిలోని అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారులు హరీష్ రావుకు సంప్రదాయ పద్ధతిలో ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
హరీశ్‌రావు వెంట మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, రజనీ సాయిచంద్, ఇంతియాజ్‌తో పాటు పలువురు ఉన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కురుమూర్తి స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి శ్రీ @BRSHarish సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారులు హరీష్ రావుకు సంప్రదాయ పద్ధతిలో ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. pic.twitter.com/RlvTW1BWRF
— Office of Harish Rao (@HarishRaoOffice) November 20, 2024