Harish Rao | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడి.. ఎన్నికల తర్వాత గజినీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయాడు అని హరీశ్‌రావు విమర్శించారు. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు.. కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అని సెటైర్లు వేశారు. అందులో కూడా రెండు రకాల కటింగులు.. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగులు, ఇంకోటి ఏమో కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలను కటింగ్ చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు.
బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపిస్తాము.. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గల్లా పట్టుకొని అడుగుతారు. ఇవాళ ప్రజలు ఏ రకంగా తిరగపడుతున్నారో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో చూశాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది అని హరీష్ రావు హెచ్చరించారు.