Harish Rao | హైదరాబాద్ : అండర్ -19 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం భారతదేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ గెలుపు ప్రతిభ, కృషి, దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుందన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిష.. ఈ టోర్నీలో 300 కంటే ఎక్కువ పరుగులు చేయడమే కాకుండా 10 వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందన్నారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు. గొంగడి త్రిష భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
వుమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు (8×4) చేసి నాటౌట్‌గా నిలిచింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23 పరుగులు)టాప్ స్కోరర్. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత జట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ తీశారు.
Proud moment #TeamIndia 🇮🇳
Congratulations to the ICC U19 Women’s T20 World Cup 2025 Champions! A phenomenal achievement showcasing talent, hard work, and determination.
Special shoutout to Telangana’s Gongadi Trisha for her stellar performance with over 300 runs and 10… pic.twitter.com/NNjCk88zwV
— Harish Rao Thanneeru (@BRSHarish) February 2, 2025
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha | అండర్ -19 వుమెన్స్ జట్టుకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు..