Viral Video | ఛాయ్ హోటల్లో కూర్చొని భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫైళ్లపై సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేయడం ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని భూముల మార్కెట్ విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఆ విలువ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త విలువ అమలులోకి రాకముందే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పెద్దసంఖ్యలో క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు రావడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దళారులతో కుమ్మక్కై ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా కదిరి రిజిస్ట్రార్ శ్రీనివాసులు ప్లాన్ చేసుకున్నారు.
ఈ క్రమంలో కొత్త విలువలు అమల్లోకి రావడానికి ఒక్క రోజు ముందు అంటే శుక్రవారం నాడు రిజిస్ట్రార్ శ్రీనివాసులు సెలవు పెట్టారు. ఆఫీసుకు రాకుండా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో ఉన్న ఓ ఛాయ్ కొట్టులో తన దుకాణాన్ని తెరిచారు. దళారులతో కలిసి వచ్చిన అర్జీదారులను ఛాయ్ హోటల్‌కు పిలిపించుకుని అక్కడే దస్తావేజులపై సంతకాలు చేశారు. ఇది గమనించిన స్థానికులు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.ఈ నిర్వాకంపై వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు అందుబాటులోకి రాలేదు.
ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు.. టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సబ్ రిజిస్టార్
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్న కదిరి సబ్ రిజిస్టార్ శ్రీనివాసులు
కార్యాలయంలోని తన ఛాంబర్లో కూర్చొని సంతకాలు చేయాల్సిన అధికారి ఇలా… pic.twitter.com/bMKqxEXvX4
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2025