NAREGA | హైదరాబాద్ : రాష్ట్రానికి మంజూరైన నరేగా పని దినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసింది. ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేసింది. రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా సాధించిందేమీ లేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలున్నా ప్రయోజనం లేదు. తెలంగాణకు జరిగే అన్యాయంపై స్పందించకపోవడం దుర్మార్గం. 4 నెలలుగా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించడం లేదు. వారి జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్రం వెంటనే నరేగా పని దినాలను పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల జీతాలు చెల్లించాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
The Centre Govt has slashed MGNREGS workdays for Telangana by half, from 12.22 crore workdays in 2024-25 to just 6.5 crore this year.
Despite 42 trips to Delhi by CM @revanth_anumula , Telangana’s MGNREGS workdays were slashed by half.
It raises questions about the… pic.twitter.com/2ZIrsUGzmm
— Harish Rao Thanneeru (@BRSHarish) May 3, 2025