Harish Rao | బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యుల నిరసన సెగలు చల్లారకముందే ఇప్పుడు హోంగార్డుల భార్యలు ఆందోళనలకు దిగారు. తమ సమస్యలను పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద వద్ద నిరసన దీక్ష చేపట్టారు. హోంగార్డుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని.. జీతాలను సరైన సమయానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు హోంగార్డుల భార్యలను అరెస్టు చేసి తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్న టీజీఎస్పీ పోలీసుల భార్యలు రోడ్డెక్కితే, నేడు హోంగార్డుల భార్యలు రోడ్డెక్కారని హరీశ్‌రావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నరని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసుల ఆందోళనలతో పాటు శాంతి భద్రతలు అడుగంటిన దృశ్యాలే కనిపిస్తున్నాయని అన్నారు. హోం మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పట్టాలు తప్పిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు.
మొన్న టీజీఎస్పీ పోలీసుల భార్యలు రోడ్డెక్కితే,
నేడు హోంగార్డుల భార్యలు రోడ్డెక్కారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నరు.రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసుల ఆందోళనలు, అడుగంటుతున్న శాంతిభద్రతలు
హోం మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… pic.twitter.com/SPnzhoNz1X— Harish Rao Thanneeru (@BRSHarish) November 2, 2024