Harish Rao | హైదరాబాద్ : కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కారుడు జి ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఎల్లయ్య భౌతికకాయానికి హరీశ్‌రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎల్లయ్య మృతి కార్మిక లోకానికి తీరని లోటు అని హరీశ్ రావు పేర్కొన్నారు.
బీహెచ్ఈఎల్ (భెల్) కార్మిక సంఘం సీనియర్ నాయకుడు ఎల్లయ్య శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు రామచంద్రపురంలోని పనేశా మెరిడియన్ దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కార్మిక నాయకుడిగా బీహెచ్ఈఎల్తోపాటు పలు పరిశ్రమల్లోని సమస్యలను పరిష్కరించిన ఆయన మృతితో కార్మికలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త తెలిసి బీఆర్ఎస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.