Harish Rao | ఖమ్మం : ఖమ్మం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సంతోష్ రెడ్డి కాలు విరిగింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఖమ్మం మమత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంతోష్ రెడ్డిని హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. సంతోష్ రెడ్డికి హరీశ్‌రావు ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని సంతోష్ రెడ్డిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఖమ్మంలో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఓ వృద్ధుడి తలను కాంగ్రెస్ అల్లరి మూకలు పగులగొట్టారు. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తలు చెలరేగిపోయారు. బీఆర్ఎస్ నేతల కార్లపై కర్రలతో దాడులకు పాల్పడి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలకు సంబంధఙంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన సంతోష్ రెడ్డిని ఖమ్మం మమత హాస్పిటల్లో పరామర్శించిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
గాయపడిన సంతోష్ రెడ్డికి ధైర్యం చెప్పిన హరీష్ రావు.. అన్ని విధాల అండగా ఉంటామని సంతోష్ రెడ్డిని ఆదుకుంటామని చెప్పారు. https://t.co/a4Or4LHJ8t pic.twitter.com/Txrn9eL7Hb
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024
ఇవి కూడా చదవండి..
Heavy rains | వరద నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు : వీడియో
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ.. పనితనం తక్కువ : హరీశ్ రావు
Harish Rao | వరదలకు చనిపోయిన వారి విషయంలోనూ రేవంత్ అబద్ధాలు.. మండిపడ్డ హరీశ్‌రావు