Hairsh Rao | సిద్దిపేట అంటే మంచితనం, అభివృద్ధి, కీర్తికి మారు పేరని.. కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తిని మసక బారుస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో అంటే ఏనాడైనా దాడులు చేశామా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అరాచకానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిద్దిపేటకు మంచిదా ? అంటూ నిలదీశారు. కరోనా సమయంలో ఎన్నో కిట్లు పంచాం.. తన పుట్టిన రోజు రక్తదానం వంటి కార్యక్రమాలు చేశామన్నారు. సిద్దిపేట అభివృద్ధి గురించి తాను ఆలోచన చేశానన్నారు.
రూ.150 కోట్లతో ఇక్కడ ఏర్పాటు చేసిన వెటర్నరీ కాలేజీని కొడంగల్ తీసుకుపోతున్నారని.. కొత్తది కావాలంటే పెట్టుకో, కానీ ఇక్కడి కాలేజి ఎలా తీసుకువెళ్తారని మండిపడ్డారు. అరాచక శక్తులు లాగా వ్యవహరిస్తున్నారని.. తాను ఎప్పడు దాడులను ప్రోత్సహించలేదన్నారు. భవిష్యత్‌లోనూ చేయనన్నారు. సిద్దిపేట ప్రజలకు సేవ చేయడమే నా జీవితమన్నారు. ఇదిలా ఉండగా.. హరీశ్ క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం హరీశ్‌రావు శనివారం సాయంత్రం సిద్దిపేటకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తులనుద్దేశించి మాట్లాడారు.