తెలంగాణ రావడం ఇష్టంలేని మాతృద్రోహి రేవంత్‌రెడ్డికి ఈ మట్టి బిడ్డ కేసీఆర్ త్యాగాలు ఎట్లా కనిపిస్తయ్? నీ లాంటి కొరివి దయ్యాన్ని తెచ్చుకొని పొరపాటు చేశామని తెలంగాణ సమాజం పశ్చాత్తాపపడుతున్నది.
– హరీశ్
ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోయి పట్టుబడ్డ దొంగ.. టీచర్లకు నీతి వచనాలు చెప్తున్నడు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎకించే ప్రయత్నం చేస్తున్నడు. విద్యార్థులకు బిల్లా, రంగాల గురించి బోధించాలని టీచర్లకు చెప్తున్నవా?
-హరీశ్
కట్టిన ఇంటికి సున్నం వేస్తే ఇల్లు నువ్వు కట్టినట్టేనా? కేసీఆర్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలు కాదా? స్వార్థం కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టి మోసంచేస్తున్న దగాకోరువు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్ చేసింది నువ్వు..
– హరీశ్
హైదరాబాద్, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డే అసలు సిసలు కొరివి ద య్యమని, రేవంత్ నుంచి తెలంగాణను కాపా డే కొర్రాయి కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేసీఆర్‌ను కొరివి ద య్యమని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ అనరని, తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌రెడ్డి లాంటి ఎన్నో కొరివి దయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిజం చేసిన ఉద్యమ సూరీడు కేసీఆర్ అని స్పష్టంచేశారు. బుధవారం ఎల్బీస్టేడియంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఓ ప్రకటనలో ఘాటుగా స్పందించారు. రేవంత్‌రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టుగా ఉన్నదని ఎద్దేవాచేశారు. ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కేసీఆర్‌ను తిట్టేందుకే వినియోగిస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి పొరపాటున 20 14లో అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేసేవాడని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కాబట్టే రేవంత్ సీఎం కాగలిగాడని, సీఎం అనే ఉద్యోగం కూడా కేసీఆర్ చలవేనని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
నోటిఫికేషన్లన్నీ గత సర్కార్వే
30 వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతోనే ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హరీశ్ సూచించారు. నోటిఫికేషన్ ఇచ్చింది.. ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది.. పరీక్షలు నిర్వహించింది కూడా బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. ‘రేవంత్‌రెడ్డి చేసిన పనేందంటే వంట అయినంక గంటె తిప్పిండు అంతే’ నని ఎద్దేవా చేశారు. అలవాటు ప్రకారమే రేవంత్ అబద్ధం చెప్పాడని, మూడు నెలల్లోనే ఇచ్చినమని చెప్పుకొన్న 30వేల ఉద్యోగాల సంగతి కూడా ఇదేనని దుయ్యబట్టారు. వాటికి నోటిఫికేషన్ ఇచ్చింది , పరీక్షలు నిర్వహించిందీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ సర్కారేన ని హరీశ్ స్పష్టంచేశారు.
7,094 స్టాఫ్ నర్సుల నియామకాల విషయంలోనూ ఇలానే అబ ద్ధం చెప్పారని, స్టాఫ్ నర్సులు, సింగరేణి, పోలీ స్, టీచర్ల నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్సేనని, పరీక్ష నిర్వహించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. నోటిఫికేషన్లు లే కుండా, పరీక్షలు నిర్వహించకుండా, ఏకంగా నియామక పత్రాలు ఇవ్వడం కుదురుతుం దా? అని ప్రశ్నించారు. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 8,792 టీచర్ పోస్టులు, గురుకులాల్లో 11 వేలకు పైగా టీచర్ పోస్టులు, 12 వేల నా న్ టీచింగ్ పోస్టులు మంజూరు ఇచ్చామని చె ప్పారు. ఇంటర్ కాలేజీల్లో 3,096 మందిని, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో 520 మందిని, డిగ్రీ కాలేజీల్లో 280 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో 3,232 పోస్టులు, యూనివర్సిటీల్లో 1,061 పోస్టులు మంజూరు చేశామని, ఇవ న్ని దాచేస్తే దాగని సత్యాలని హరీశ్ గుర్తుచేశారు. 25 వేల మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి, బీఆర్ఎస్ ఇచ్చిన 5,089 పోస్టులకు అదనంగా ఆరు వేలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డీఎస్సీని దగా చేశారని మండిపడ్డారు.
సీఎం స్థానంలో ఉండి ఇలా పోల్చవచ్చా?
సీఎం స్థానంలో ఉండి బిల్లా, రంగాలతో పోల్చవచ్చా? అని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలే దా? అని నిలదీశారు. కవిత ఎమ్మెల్సీగా ఎన్నికల ప్రక్రియలో ఓట్లతోనే గెల్చిచిందని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో లక్షా 60 వేలకు పైగా ఉద్యోగాలిచ్చారని, గతంలో అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తానని మభ్యపెట్టారని, పది నెలలైనా ఉద్యోగాల ఊసే లేదని మండిపడ్డా రు. ‘విద్యార్థులు, నిరుద్యోగులు నీ మోసాన్ని అర్థం చేసుకున్నరు.. నీకు కొలువు ఇచ్చిన నిరుద్యోగులే నీకు కొరివి పెడుతరు’ అంటూ హెచ్చరించారు. ‘నిన్ను పడగొడతం అని ఎవరో అన్నట్టు సానుభూతి రాజకీయాలు మొదలు పెడుతున్నవ్.. నీ మాటలే నిన్ను పడగొడతయ్. హర్యానా ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీలకు గోరీ తవ్విండ్రు.. తెలంగాణలో ఇప్పుడు బొంద తవ్వడం మొదలైంది’ అంటూ మండిపడ్డారు. ‘తెలంగాణను నీ దుష్ట పన్నాగం నుంచి కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తం.. ఉద్యమం తెలియని వాడివి.. తెలంగాణ ఆర్తి లేనివాడివి.. తాతకు దగ్గులు నేర్పుతవా?’ అని ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ద్రోహులకు కట్టు బానిసవు నువ్వు.. తెలంగాణ ప్రజలకు బానిసలం మేము’ అంటూ హరీశ్ స్పష్టంచేశారు.
గంట కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్న అని ఈ సిపాయి చెప్తున్నడు.. అంత పనిచేస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలెందుకు? ప్రజలను ఎట్ల బాధపెట్టాల్నని రెస్ట్ లేకుండా ఆలోచిస్తున్నవా?
–హరీశ్