Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ అంశాన్ని హరీశ్‌రావు ప్రస్తావిస్తూ.. మీరు బోధించే వాటిని మీరు ఆచరించగలరా..? అని రాహుల్ గాంధీని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. మీ తండ్రి దివంగత రాజీవ్ గాంధీ 52వ రాజ్యంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను మీరు కోరుతారా..? అని ప్రశ్నించారు. లేదా రాజ్యాంగాన్ని చేతిలో మోసుకెళ్లడం కేవలం ఎన్నికల మోసమా..? అని రాహుల్ గాంధీని హరీశ్‌రావు నిలదీశారు.
. @RahulGandhi Can you practice what you preach?
Will you urge the Telangana Speaker to act as per the anti-defection law, introduced by your father, the late Rajiv Gandhi, through the 52nd Constitutional Amendment?
Or is carrying the Constitution in hand just an electoral… pic.twitter.com/mCxX8dYbZC
— Harish Rao Thanneeru (@BRSHarish) July 31, 2025