Harish Rao | హైదరాబాద్ : శాసనమండలి చీఫ్ విప్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ఎలా నియమించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని హరీశ్‌రావు విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు..? ఆయనపై చైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది. చైర్మన్ ఇచ్చిన బులెటిన్(మండలి చీఫ్ విప్‌గా నియమించడం) అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చింది. దీన్ని కూడా అనర్హత పిటిషన్లో సాక్ష్యంగా చేరుస్తాం. ఎమ్మెల్సీ హోదాలోనే పంద్రాగస్టు, సెప్టెంబర్ 17న మహేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. మార్చి 15 నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ అని బులెటిన్ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తాం. రాష్ట్ర గవర్నర్‌తో పాటు డీవోపీటీకి కూడా లేఖ రాస్తాం.. గవర్నర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Warangal | ఆగిన గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ : వీడియో
Madusudhana Chary | శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతల స్వీకరణ
Manne Krishank | మెయిన్‌హార్ట్ లీగల్ నోటీసులకు భయపడం.. తేల్చిచెప్పిన మన్నె క్రిశాంక్