Harish Rao | హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ను అరెస్టు చేయడం అమానుషం.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషం అని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి.. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజా పాలన అని హరీశ్‌రావు నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. మీ సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.? ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Kaleshwaram | చివరికి కాళేశ్వరమే దిక్కయింది.. గంగా ప్రవాహంలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ అబద్ధాలు
KTR | కాకుల్లా ఏకం కావాలి.. రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించాలి.. కార్మికులకు కేటీఆర్ పిలుపు
KTR | లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏం పీకినవ్ రేవంత్..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్