Harish Rao | హైదరాబాద్ : సుప్రీంకోర్టును అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న సమయంలో, రేవంత్ రెడ్డి ఉపఎన్నికలు రావు అని చెప్పడం కరెక్ట్ కాదు అది న్యాయస్థానానికి అవమానం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉప ఎన్నికలు రావు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భయపడకండి అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందిస్తూ.. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ హౌజ్‌కు ఇమ్యూనిటీ ఉంది.. ఈ హౌజ్‌లో కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు. అది గతంలో కాలేదు. ఇప్పుడు కూడా కాదు అని సీఎం అంటే.. నేను వెంటనే సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్‌ని మీరు ఎట్ల మాట్లాడుతారని ప్రశ్నిస్తే.. మాకు ఇమ్యూనిటీ ఉంది.. ఈ సభలో ఏదైనా మాట్లాడొచ్చు అని అన్నారు. అయితే ఈ సందర్భంగా చెబుతున్నాం.. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అవమానించేలా మాట్లాడారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇక సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ.. స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును అవమానించేలా మాట్లాడాడు
సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న సమయంలో, రేవంత్ రెడ్డి ఉపఎన్నికలు రావు అని చెప్పడం కరెక్ట్ కాదు అది న్యాయస్థానానికి అవమానం –మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు https://t.co/vujmR3CPg2 pic.twitter.com/1TdrCgT99l
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2025
తెలంగాణలో ఉప ఎన్నికలు రావు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భయపడకండి – రేవంత్ రెడ్డి pic.twitter.com/v89CES8BLC
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2025