Harish Rao | సంగారెడ్డి : నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఆనాడు రేవంత్ రెడ్డిని తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయలేదు.. చంద్రబాబుని రాజీనామా చేయమంటే తుపాకీ పట్టుకుని వచ్చాడు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు గుర్తు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ పోరాటం వల్ల కాదు బ్రిటీష్ వాళ్లే దయతలిచి స్వాతంత్ర్యం ఇచ్చారు అన్నట్టు రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుందని హరీశ్‌రావు తెలిపారు.
సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డినే ఇప్పుడు అదే నోటితో దేవత అంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మేమే తెలంగాణ తెచ్చామని చెబితే అయిపోతోందా. ఎక్కడ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు అని సీఎం రేవంత్ చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జూన్ 2, 2015లో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాం ప్రతిష్టించాం. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు తొలగిస్తారా..? జూన్ 22, 2023 నాడు సెక్రటేరియట్ వద్ద కేసీఆర్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని ఎవరైనా మార్చారా..? నువ్ మార్చాల్సింది ప్రజల బతుకు.. విగ్రహాల మార్పు కాదు. తెలంగాణ ఉద్యమం చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది అందులో ద్రోహ చరిత్రే ఉంటుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి ఏ రోజు ‘జై తెలంగాణ’ అనలేదు.. ఉద్యమంలో పాల్గొనలేదు : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన సిధారెడ్డికి ఉద్యమాభినందనలు : హరీశ్‌రావు