Harish Rao Birthday | ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్‌లోని టవర్ బ్రిడ్జి దగ్గర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మెంబర్షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా కేక్ కట్ చేసి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావు ప్రజాసేవలో పరిపూర్ణుడని, ప్రజల మనసు గెలిచిన నాయకుడని కొనియాడారు. తరుణ్ లూనావత్ మాట్లాడుతూ.. హరీశ్‌రావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత అని, వారు ఆరోగ్యంగా శతవసంతాలు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, మెంబర్షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ నాయక్, దిలీప్, అనిల్ యాదవ్, సాయి చరణ్ రావు, రమేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.