Harish Rao | సిద్దిపేట : విజయదశమి దసరా పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని శ్రీ ఉమాపార్వతీ సమేత కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు శమీ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని హరీశ్‌రావు ఆ భగవంతుడిని ప్రార్థించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతిరూపమని.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Jagityala | జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో వన్య ప్రాణుల మాంసంతో అధికారుల దావత్ ?
TGPSC | గ్రూప్-3 అభ్యర్థులకు కీలక అప్డేట్.. అరగంట ముందే గేట్లు బంద్