TGPSC | గ్రూప్-3 అభ్యర్థులకు కీలక అప్డేట్.. అరగంట ముందే గేట్లు బంద్
నవంబర్‌లో జరిగే గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని, అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్ ప్రకటించింది.
- నవంబర్ 17, 18న గ్రూప్-3 పరీక్షలు
- అభ్యర్థులకు పలు సూచనలు చేసిన టీజీపీఎస్సీ
- మహిళా అభ్యర్థులు మంగళ సూత్రం, గాజులు తప్ప మరే ఆభరణాలు వేసుకెళ్లొద్దు
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): నవంబర్‌లో జరిగే గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని, అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్ ప్రకటించింది. మొదటి సెషన్‌కు ఉదయం 9:30 గంటలకు, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 2:30కు గేట్లు క్లోజ్ చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఓఎమ్మార్ పద్ధతిలో నిర్వహించనున్న పరీక్షలపై కమిషన్ ముఖ్య సూచనలు చేసింది.
కమిషన్ సూచనలిలా..
- మొదటి సెషన్‌కు ఉదయం 8:30 నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1: 30 నుంచి అభ్యర్థులను పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు.
- అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లిష్, లేదా ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలిస్తారు. దరఖాస్తు సమయంలో ఎంపికచేసుకున్న ప్రకారం ప్రశ్నపత్రాలిస్తారు.
- నవంబర్ 17న ఉదయం సెషన్‌కు తీసుకెళ్లిన హాల్‌టికెట్‌నే మిగతా రెండు సెషన్లకు తీసుకెళ్లాలి.
- మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, గాజులు తప్ప మరేలాంటి ఆభరణాలు ధరించరాదు.
- పరీక్షాకేంద్రంలో ఇతరులతో మాట్లాడినా.. వస్తువులను మార్చుకున్నా, నినాదాలు చేసినా, పరీక్షకు అంతరాయం సృష్టించినా ఆయా అభ్యర్థిని డిస్క్వాలిఫై చేస్తారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్ కేసులు పెడతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

