Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీ అయ్య సొమ్మా.. రేవంత్ రెడ్డి..! గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీ లు ఇచ్చి మిగతావి వాడుకోండి అని చెప్పడానికి నువ్వెవడివి? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. తెల్వకపోతే తెలుసుకొని మాట్లాడు.. మీ అజ్ఞానం, మూర్ఖత్వంతో తెలంగాణ నష్టపోతుంది అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా రాజకీయ వేదికగా మార్చిండు. బనకచర్లను ఆపడానికి ప్రయత్నం చేయకుండా.. బనకచర్లను గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టిఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అంటాడు. మీ అయ్యా జాగిరా..? నువ్వేమైనా రాజువా..? నువ్వు ఎలా చెబుతావు..? ఇది డెమొక్రటిక్ ప్రభుత్వం. స్టేట్ ఆఫ్ తెలంగాణ. హూ ఆర్ యు టెల్ లైక్ దట్. మీ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ముందు రేవంత్ రెడ్డి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నిన్నటి ప్రెజెంటేషన్లోనే సుబ్రమణ్య ప్రసాద్ స్పష్టంగా చెప్పాడు. 968 టీఎంసీలకు తెలంగాణలో ప్రాజెక్టుగా రూపకల్పన జరిగింది, అందులో 946 టీఎంసీ సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది అని చెప్పిండు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోతలేదు. చంద్రబాబు దయా దక్షిణాల మీద బతికే బుద్ధి పోతలేదు. చంద్రబాబు ఇచ్చేది ఏంది వెయ్యి టీఎంసీలు. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లొనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968 టీఎంసీలలో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించాం. చంద్రబాబు ఎవడు ఇచ్చేది? మనకు అనుమతులు వచ్చాక. అంటే బనకచర్ల కట్టుకో అనే అర్థం. గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నవా. సోయి ఉంది మాట్లాడుతున్నావా..? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కేసీఆర్ కేంద్రం జల శక్తిమంత్రికి రాసిన లేఖలో.. గోదావరిలో 968 టీఎంసీ మాకు కేటాయించారు, 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి.. అందులో 1950 టీఎంసీలు మాకు కావాలి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం 1000 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో అంటున్నాడు. కేసీఆర్ 968 మరియు 1950 మా లెక్క అంటున్నాడు. ఎవరు ఏపీకి దాసోహం అవుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ రికార్డు తెప్పించి చూసుకో అని హరీశ్‌రావు సూచించారు.
కృష్ణా విషయంలోనూ అదే అజ్ఞానం. ఆ జిల్లాలో పుట్టి కృష్ణా నదిపై అవగాహన లేకపోవడం దారుణం. ముఖ్యమంత్రి పక్కన పెట్టు.. జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా చేశావు కదా..? అందులో కూడా 500 టిఎంసి ఇచ్చి మొత్తం నీళ్లు తీసుకో అంటడు. రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఉరి తీసిన తప్పులేదు. కేసీఆర్ తెలంగాణ కోసం, నీళ్ల కోసం ఎంతో పోరాటం చేశారు. కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి ప్రభుత్వం దిగివచ్చి ఎడమ కాలువ లిఫ్టులు కూడా కుడి కాలువల మాదిరి ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్నది. అది పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్. అణువణువు క్షణక్షణం నీళ్ల కోసం తపించిన వ్యక్తి కేసీఆర్. 750 టీఎంసీల నీళ్ళు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించాం. సెక్షన్ 3 కోసం పోరాడిండు కేసీఆర్. కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 299 టీఎంసీలే వచ్చాయి. అది ఈ కాంగ్రెస్ దరిద్రం వలనే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల నిర్ణయం జరిగింది. ఆ పాపం కూడా కాంగ్రెస్‌దే. న్యాయమైన వాటా కోసం సుప్రీం వెళ్ళారు. 763 టీఎంసీ నీళ్ళు రావాలని లాయర్లకు సూచించారు. పోలవరం ద్వారా మళ్ళించే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు రావాలని కూడా చేర్చారు. దాని ప్రకారం 75 శాతం డిపెండబిలిటీ కింద 555 టీఎంసీ, 65 డిపెండబులిటీ కింద 43 టీఎంసీ, యావరేజ్ కింద 120 టీఎంసీ, వాటర్ డైవర్షన్ కింద 45 టీఎంసీ అన్ని కలిపి 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలని ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ ఫైల్ చేసింది. మీరు చెబుతున్నది ట్రిబ్యునల్‌ను ఎఫెక్ట్ చేయదా? 500 చాలు అని ఎలా అంటావు. మన వాదనకు విలువ ఉంటదా? అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
నీ అయ్య సొమ్మా.. రేవంత్ రెడ్డి!
గోదావరిలో 1,000 టీఎంసీ లు ఇచ్చి,
కృష్ణాలో 500 టీఎంసీ లు ఇచ్చి,
మిగతావి వాడుకోండి అని చెప్పడానికి నువ్వెవడివి?తెల్వకపోతే తెలుసుకొని మాట్లాడు..
మీ అజ్ఞానం, మూర్ఖత్వంతో తెలంగాణ నష్టపోతుంది.– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥 pic.twitter.com/EEyNiuPOCF
— BRS Party (@BRSparty) June 19, 2025