దేవరుప్పుల, అక్టోబర్ 19: కాంగ్రెస్ గెలిస్తే ‘రైతుబంధు’కు రాంరాం చెబుతారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న మాటలు నేడు అక్షర సత్యమైనట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. శనివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పులో మీడియాతో మాట్లాడారు.
వానకాలంలో రైతుబంధుకు ప్రభుత్వం ఎగనామం పెట్టడమంటే తెలంగాణ రై తాంగాన్ని మోసం చేయడమేనని స్పష్టం చేశారు. అసెం బ్లీ ఎన్నికలకు ముందు అమలుకాని హామీలిచ్చి ప్రజలతో ఓట్లేయించుకున్న రేవంత్రెడ్డి హామీలను అటకెక్కించడంతో నేడు ప్రజలకు ఆయన మాటల్లోని పరమార్థం బోధపడిందని అన్నారు.