ములుగు : జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తున్న రమేశ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సర్పంచ్ కిడ్నాప్ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేశ్ ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.