హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తానిచ్చిన వినతిపై 21 నెలలైనా సీఎం రేవంత్ స్పందించడం లేదని, ఈ జాప్యమే తన చావు కు దారితీస్తుందేమోనని మాజీ డీఎస్పీ నళిని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ రిపోర్టుపై సీఎం ఎటూ తేల్చకుంటే సజీవ సమాధి అవుతానని హెచ్చరించారు. మరణ వాంగ్మూలం పేరిట శు క్రవారం ఆమె మరో సంచలన లేఖ ను విడుదల చేశారు. తన దుస్థితికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమ ని ఆరోపించారు. తనను ఆనాటి కాంగ్రస్ ప్రభుత్వం సస్పెండ్ చేయ డం, వెంటాడి వేటాడటమే తన సమస్యకు మూలకారణమని తెలిపారు. ఇప్పటి కాంగ్రెస్ సర్కార్కు తానిచ్చిన ఓ రిపోర్టుపై 21 నెలలైన చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడం మరో కారణమని పేర్కొన్నారు. ఇదే జాప్యం తన చావుకు దారితీస్తుందేమోనని ఆవేదన వ్యక్తంచేశారు. తన విషయాన్ని ఎటూ తేల్చకపోతే సజీవ సమాధి అవుతానని హెచ్చరించారు.