హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో(Parliament elections) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా సజావుగా కొనసా గుతున్నాయి. కాగా, వనపర్తి జిల్లా అమరచింత(Amarachintha) జెడ్పీ హైస్కూల్లోని పోలింగ్ బూత్ 228/77లో ఈవీఎంలు(EVM Machine) మొరాయించాయి.
రెండు గంటలుగా ఈవీఎంలు పని చేయకపోవడంతో ఓటింగ్‌ను నిలిపివేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది.