జనగామ, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రజా పాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరంపై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను జనగామలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, పార్టీ నాయకుడు పల్లా సుందర రామిరెడ్డితోపాటు అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి లైవ్‌లో వీక్షించారు.
అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ గాలి మోటర్లు ఎక్కితిరుగుతూ గాలి మాటలు చెప్తున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.