(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్‌లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు వచ్చే ప్రజలు , ప్రజాప్రతినిధులు , వివిధ ప్రభుత్వశాఖల అధికారులు , మీడియా ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
హుజూరాబాద్ నుంచి వచ్చే వాహనాల కోసం చెల్పూర్ గ్రామం నుంచి ఇందిరాన గర్ వరకు 10 పార్కింగ్ స్థలాలు , జమ్మికుంట నుంచి వచ్చే వాహనాలకు 4 స్థలాలు కేటాయించారు. సాయి డెవలపర్స్ , లీడ్ క్యాప్ లో రెండు బస్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు…
వాహనాలను పోలీసులు సూచించిన ప్రదే శాల్లోనే క్రమపద్ధతిలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. హుజూరాబాద్ – జమ్మికుంట మార్గంలో కేవ లం సభకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇతర వాహనదారులు సిర్సపల్లి క్రాస్ రోడ్డు నుంచి సిర్సపల్లి , పోతిరెడ్డిపేట మీదుగా జమ్మికుంటకు వెళ్లాలి. జమ్మికుంట నుంచి హుజూరాబాద్ కు వచ్చే ఇతర వాహనదారులు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది.
జమ్మికుంట నుంచి కరీంనగర్ వెళ్లే వాహనదారులు వీణవంక , చల్లూరు , మానకొం డూరు మీదుగా , వరంగల్ , సిద్దిపేట మా ర్గంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులు కరీంనగర్‌కు వెళ్లేందుకు ఎల్కతుర్తి. ముల్కనూరు , హుస్నాబాద్ , చిగురుమామిడి మీదుగా కరీంనగర్‌కు వెళ్లాలి . అదేవిధంగా తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి హుజూరాబాద్ కు భారీ సంఖ్యలో వాహనాలు వస్తు న్నందున ఈ రహదారిపై ఎవరూ వాహ నాలను నిలపకూడదు. దారి మళ్లింపు చర్య లపై ఎలాంటి సందేహాలు ఉన్నా పూర్తి వివ రాలకోసం కరీంనగర్ అడిషనల్ డీసీపీ (పరిపాలన) జీ.చంద్రమోహన్ , స్పెషల్ ఆఫీసర్ పీ. అశోక్ ను సంప్రదించాలని సీపీ సత్యనారాయణ సూచించారు.